సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ రికార్డు మెరుపులు వృథా.. ఒక్క రన్‌‌‌‌‌‌‌‌ తేడాతో పంజాబ్‌‌‌‌‌‌‌‌ విజయం

సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ రికార్డు మెరుపులు వృథా.. ఒక్క రన్‌‌‌‌‌‌‌‌ తేడాతో పంజాబ్‌‌‌‌‌‌‌‌ విజయం

జైపూర్‌‌‌‌‌‌‌‌: టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (20 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌‌‌‌‌లతో 62) మెరుపులు మెరిపించినా.. విజయ్‌‌‌‌‌‌‌‌ హజారే ట్రోఫీలో ముంబైకి ఓటమి తప్పలేదు. చివరివరకు గొప్పగా పోరాడిన పంజాబ్‌‌‌‌‌‌‌‌.. గురువారం జరిగిన ఎలైట్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–సి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఒక్క రన్‌‌‌‌‌‌‌‌ తేడాతో సంచలన విజయం సాధించింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన పంజాబ్‌‌‌‌‌‌‌‌ 45.1 ఓవర్లలో 216 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. 

రమన్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (72), అన్మోల్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (57) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. ముషిర్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ 3, ఓంకార్‌‌‌‌‌‌‌‌, శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే, శశాంక్‌‌‌‌‌‌‌‌ తలా రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ముంబై 26.2 ఓవర్లలో 215 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే దూకుడుగా ఆడిన సర్ఫరాజ్‌‌‌‌‌‌‌‌.. పంజాబ్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌‌‌‌‌ వేసిన ఓ ఓవర్‌‌‌‌‌‌‌‌లో 6, 4, 6, 4, 6, 4తో 30 రన్స్‌‌‌‌‌‌‌‌ రాబట్టాడు. ఈ క్రమంలో15 బాల్స్‌‌‌‌‌‌‌‌లో ఫాస్టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఫిఫ్టీ కొట్టాడు. లిస్ట్‌‌‌‌‌‌‌‌–ఎ క్రికెట్‌‌‌‌‌‌‌‌లో ఈ ఫీట్‌‌‌‌‌‌‌‌ సాధించిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు అభిజిత్‌‌‌‌‌‌‌‌ కాలే, అటిత్‌‌‌‌‌‌‌‌ షేత్‌‌‌‌‌‌‌‌ (16 బాల్స్‌‌‌‌‌‌‌‌) పేరిట సంయుక్తంగా ఉండేది. కెప్టెన్ శ్రేయస్‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌ (45), అంగ్‌‌‌‌‌‌‌‌క్రిష్‌‌‌‌‌‌‌‌ రఘువంశీ (23), ముషిర్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (21) పోరాడినా ముంబై ఓటమిని తప్పించలేకపోయారు. గుర్నూర్‌‌‌‌‌‌‌‌ బ్రార్‌‌‌‌‌‌‌‌, మయాంక్‌‌‌‌‌‌‌‌ మార్కండే చెరో నాలుగు వికెట్లు తీశారు. బ్రార్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది.