పోలార్డ్ ఊచకోత..ముంబై హ్యట్రిక్ విక్టరీ

పోలార్డ్ ఊచకోత..ముంబై హ్యట్రిక్ విక్టరీ

నాలుగు రోజులుగా చప్పగా సాగుతున్న ఐపీఎల్లో మళ్లీ జోష్వచ్చింది. లో స్కోరింగ్మ్యాచ్లతోనిరాశ పడుతున్న అభిమానులకు బుధవారం పోరు ఫుల్మీల్స్వడ్డించింది. మొదట రాహుల్రాకింగ్సెంచరీకి తోడు యూనివర్సల్బాస్క్రిస్గేల్రచ్చ లేపితే.. ఛేజింగ్లో కరీబియన్కింగ్పొలార్డ్‌‌ (31 బంతుల్లో 3 ఫోర్లు , 10 సిక్సర్లతో 83) ఊచకోత కోస్తూ భారీ స్కోరును సింగిల్హ్యాం డ్తో ఛేదించాడు. రోహిత్గైర్హా జరీలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పొలార్డ్‌‌.. వైపు వికెట్లుపడుతున్నా అదరక బెదరక నిలిచి ముంబైకి వరుసగా మూడో విజయాన్ని కట్టబెట్టాడు

క్షణక్షణం మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచ్‌ లో చివరి వరకు పోరాడిన ముంబైనే విజయంవరించింది. కింగ్స్‌‌ లెవెన్‌ పంజాబ్‌ తో బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్‌‌ 3 వికెట్ల తేడాతో గెలిచి హ్యాట్రిక్‌‌ నమోదు చేసింది. వరల్డ్‌‌ కప్‌ బెర్త్‌‌ కన్ఫామ్‌ చేసుకోవడంపై దృష్టిపెట్టిన టీమిండియా బ్యాట్స్‌‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌(64 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 100 నాటౌట్‌ ) క్లాసిక్‌‌ సెం చరీకి.. యూనివర్సల్‌ బాస్‌‌ క్రిస్‌‌ గేల్‌ (36 బంతుల్లో 3ఫోర్లు, 7 సిక్సర్లతో 63) సుడిగాలి ఇన్నింగ్స్‌‌ తోడవడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. హార్దిక్‌‌ పాండ్యా(2/57) వికెట్లు తీసినా భారీగా పరుగులు ఇచ్చుకున్నా డు. ఛేజింగ్‌ లో కీరన్‌ పొలార్డ్‌‌ దడదడలాడించడంతో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 198 రన్స్‌‌ చేసి గెలిచింది. చివరి రెండు ఓవర్లలో 32 రన్స్‌‌ చేయాల్సిన దశలో కరన్‌ ఓవర్‌ లో 4,0,6,6తో17 రన్స్‌‌ రాబట్టిన పొలార్డ్‌‌.. ఆఖరి ఓవర్‌తొలి రెండు బంతులకే 11 రన్స్‌‌ కొట్టి ఔటయ్యాడు. ఆ తర్వాత జోసెఫ్‌ (15నాటౌట్‌ ), రాహుల్‌ చహర్‌ (1 నాటౌట్‌ )ఒత్తిడిని అదిగమిస్తూ ఒక్కో పరుగుసాధించి పొలార్డ్‌‌ శ్రమ వృథాకాకుం డా చేశారు.

పొలార్డ్పది సిక్సర్లతో..

అసలే భారీ టార్గె ట్‌ .. ఆపై హిట్‌ మ్యాన్‌ రోహి త్‌ శర్మ కూడా ఆడటం లేదు. దీంతో ముంబైకి ఛేజింగ్‌ కష్టమే అనిపించింది. కెప్టెన్‌ ప్లేస్‌‌లో జట్టులోకి వచ్చిన సిద్ధేశ్‌ లాడ్‌(15) తొలి ఓవర్‌ లో సిక్స్‌‌, ఫోర్‌ కొట్టినా..కాసేపటికే ఔటయ్యాడు. సూర్యకుమార్‌ (15బంతుల్లో 4 ఫోర్లతో 21) ఉన్నంత సేపు భారీషాట్ల పైనే దృష్టిపెట్టాడు. అంకిత్‌ ఓవర్లో మూడుఫోర్లతో మురిపించాడు. దీంతో ముంబై కూడా ఆరు ఓవర్లలో ఫిఫ్టీ మార్క్‌‌ దాటి రేస్‌‌లోనే కనిపించింది. వికెట్‌ కీపర్‌ రాహుల్‌ క్లిష్టమైన క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన డికాక్‌‌ (23 బంతుల్లో 24)దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాసేపటికే మిల్లర్‌ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ కు వెనుదిరిగాడు. దీం తోఇన్నింగ్స్‌‌ను చక్కదిద్దే బాధ్యత స్టాండిన్‌ కెప్టెన్‌ పొ లార్డ్‌‌ పై పడింది. అందుకు తగ్గట్లే ఆకట్టుకున్న అతడు ఆరు బంతుల వ్యవధిలో మూడు సిక్స్‌‌లు కొట్టి తన ఉద్దేశం చాటాడు. మరో వైపు కుదురుకున్నట్లే కనిపించిన ఇషాన్‌ కిషన్‌ (7) దురదృష్ట వశాత్తు రనౌటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్‌‌ (13 బంతుల్లో 2ఫోర్లతో 19)తో కలిసి పొ లార్డ్‌‌ కొన్ని మంచి షాట్లతో అలరించాడు. 5 ఓవర్లలో 63 రన్స్‌‌ చేయాల్సి న దశలో షమీ (3/21)ఒకే ఓవర్‌ లో పాండ్యా బ్రదర్స్‌‌ హార్దిక్‌‌, క్రునాల్‌ (1)ను ఔట్‌చేయడంతో ముంబై విజయం కష్టమనిపించిం ది. అయినాఏ దశలోనూ ఆశలు కోల్పోని పొలార్డ్‌‌ చివరి వరకు నిలి చిముంబైకి అదిరిపోయే విజయాన్నందించాడు.గే

ల్సుడిగాలి.. రాహుల్

సునామి అంతకుముందు టాస్‌‌ ఓడి బ్యాటిం గ్‌ కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌‌ నెమ్మదిగా ఆరంభమైం ది. క్రిస్‌‌ గేల్‌ , రాహుల్‌క్రీజులో ఉన్నా స్కోరు ముందుకు కదల్లేదు. అయితే అదితుఫాన్‌ కు ముందు వచ్చే ప్రశాం తత అని తెలిసేం దుకుఎక్కువ సమయం పట్టలేదు. గేల్‌ కుదురుకోవడానికి టైమ్‌తీసుకుంటున్నా డంటే.. ఆ తర్వాత బీభత్సం సృష్టిస్తాడని మరోసారి రుజువుచేశాడు. ఇన్నింగ్స్‌‌ ఐదో ఓవర్‌ లో మూడుసిక్స్‌‌లు, ఓ ఫోర్‌ తో 23 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి పంజాబ్‌ వికెట్‌ నష్టపోకుం డా 50 రన్స్‌‌ చేసింది.అప్పటివరకు స్ట్రయిక్‌‌ రొటేటింగ్‌ కే పరిమితమైన రాహుల్‌ కూడా స్పీడందుకున్నాడు. జోసెఫ్‌ బౌలింగ్‌ లో 6,4తో ఫుల్‌స్వింగ్‌ లోకి వచ్చేశాడు. ఆ తర్వాత హార్దిక్‌‌ ఓవర్‌ లో మరోసారి రెచ్చి పోయిన గేల్‌ 6,4,4తో 17 పరుగులు పిండుకున్నాడు.అక్కడి నుంచి ఓవర్‌ కో సిక్స్‌‌ చొప్పున కొట్టుకుంటూ వచ్చిన గేల్‌ 10.2 ఓవర్లలో టీమ్‌ స్కోరు ను సెంచరీ దాటించడంతోపాటు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నా డు. ఈ జోరు చూస్తే పంజాబ్‌ అలవోకగా 200 చేస్తుందనిపించినా.. సెకండ్‌ హాఫ్‌ లో చెలరేగిన ముంబై బౌలర్లు భారీ స్కోరు చేయకుండా బ్రేకులు వేశారు.తొలి వికెట్‌ కు 116 రన్స్‌‌ జోడించాక క్రునాల్‌ పట్టిన చక్కటి క్యాచ్‌ తో గేల్‌ ఇన్నింగ్స్‌‌కు తెరపడింది. అక్కడి నుంచి కింగ్స్‌‌ లెవెన్‌ ఇన్నింగ్స్‌‌ స్వరూపం మారింది. పరుగుల రాక కష్టమవడంతో పాటు మిల్లర్‌ (7) కరుణ్‌ నాయర్‌ (5), కరన్‌ (8) ఔటవడంతో.. పంజాబ్‌ ఇంకా తక్కువ స్కోరే చేస్తుందనిపించింది. అయితే 10వ ఓవర్లో నే కీపర్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన రాహుల్‌ ఆ తర్వత లైఫ్‌ ను సద్వినియోగం చేసుకుంటూ అజేయ సెంచరీతో టీమ్‌ కు భారీ స్కోర్‌ కట్టబెట్టాడు. అతడికి మన్‌ దీప్‌ (7 నాటౌట్‌ ) చక్కటి సహకారం అందించా డు.

మూడు ఓవర్లు..

17 ఓవర్లు పూర్తయ్యేసరికి 52 బంతుల్లో 64 రన్స్‌‌తో ఉన్న రాహుల్‌ ఆ తర్వాత ఎదుర్కొన్న 12 బంతుల్లో .. 36 రన్స్‌‌ చేసి సెంచరీ మార్క్‌‌ రీచ్‌ అయ్యాడు. మొదట బుమ్రా బౌలింగ్‌ లోఫోర్‌ తో స్టార్ట్‌‌ చేసిన రాహుల్‌ .. హార్దిక్‌‌ వేసిన 19వ ఓవర్లోటాప్‌ గేర్‌ లోకి వచ్చేశాడు. తొలి నాలుగు బంతులను 6,4,6,6బాదడంతో ఒక్కసారిగా 92 మీదకు చేరాడు. చివరి ఓవర్‌తొలి బంతికే సిక్స్‌‌ కొట్టిన రాహుల్‌ ఆ తర్వాత మరో రెండుబంతులను వదిలేసినా.. నాలుగో బంతికి డబుల్‌ తీసి ఐపీఎల్‌ లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నా డు. ఆఖరి మూడు ఓవర్లలో పంజాబ్‌ 54 పరుగులు చేయడం విశేషం.