మునావర్ ఫారుఖీ షో..శిల్పాకళా వేదిక వద్ద బందోబస్తు

మునావర్ ఫారుఖీ షో..శిల్పాకళా వేదిక వద్ద బందోబస్తు

హైదరాబాద్‌‌లో మునావర్ ఫారూఖీ షో పై ఉత్కంఠ నెలకొంది. షోపై సస్పెన్స్ కొనసాగుతోంది. మునావర్ కు ఫీవర్ రావటంతో కరోనా టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నానని ఇన్ స్టాగ్రామ్ లో మునావర్ తెలిపాడు. నిన్న బెంగళూరులో జరగాల్సిన షో కూడా వాయిదా పడింది. దీంతో మునావర్ ఫరూఖీ షో కు హాజరవుతాడా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ...శిల్పకళావేదికలో జరిగే షో కోసం ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు షో కొనసాగనుంది. షోకు వచ్చే వారు వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్స్ తీసుకరావద్దని పోలీసులు సూచించారు. బుక్ మై షోలో టికెట్స్ పూర్తిగా సేల్ అయ్యాయి.  

సిటీలో మునావర్ షోను అడ్డుకొని తీరతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, హిందూ సంఘాల నేతలు హెచ్చరించారు. దీంతో షో జరగనున్న మాదాపూర్ శిల్పకళావేదిక దగ్గర 2 వేల మంది పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే రాజసింగ్ ని అరెస్ట్ చేసి లాలాగూడా పీఎస్ కి తరలించారు. మునావర్ ఫారూఖ్ షో ను ఎట్టిపరిస్థితుల్లోనూ జరగనివ్వవమని భజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా హెచ్చరించారు. హిందూ దేవుళ్లను కించపరిచే షోను అడ్డుకుంటామన్నారు. మునావర్ ఫారూఖీ షోకు అనుమతులు ఉన్నాయని  మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. కార్యక్రమానికి ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.