ఫిర్యాదు చేశామని మనసులో పెట్టుకొని టార్చర్ పెడుతుండు

ఫిర్యాదు చేశామని మనసులో పెట్టుకొని టార్చర్ పెడుతుండు

కమిషనర్ టార్చర్ పెడుతున్నడని మున్సిపల్ కార్మికుల ఆందోళన

మెట్​పల్లి, వెలుగు: మెట్ పల్లి బల్దియా కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ టార్చర్ చేస్తున్నాడని, పారిశుధ్య కార్మికులను చిన్నచూపు చూస్తున్నాడని మున్సిపల్ కార్మికులు గురువారం బల్దియా ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. అకారణంగా కార్మికులను తిడుతున్నాడని, ఆయన తీరుపై ప్రశ్నిస్తే డ్యూటీల్లోంచి తీసేస్తామని బెదిరిస్తున్నారని కార్మిక సంఘం అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్ అన్నారు. మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పారిశుధ్య కార్మికుల పట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొద్దిరోజుల కింద ఓ కార్మికుడ్ని బూతులు తిట్టడంతో మెట్ పల్లి మున్సిఫ్ కోర్టు జడ్జికి ఫిర్యాదు చేశామని, అది మనసులో పెట్టుకొని మాపై కక్ష్యపూరితంగా  వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. డ్యూటీలో ఉన్న బిల్ కలెక్టర్ అనిల్​ను కారణం లేకుండా విధుల్లోంచి తొలగించి, ఇతర విభాగంలో డ్యూటీ వేస్తానని చెప్పారన్నారు. కాగా.. బల్దియా కార్మికులు లక్ష్మణ్, అనిల్, నర్సయ్య గురువారం మందు తాగి మున్సిపల్ ఆఫీస్​కు వచ్చి అధికారులతో అసభ్యంగా ప్రవర్తించారని, డ్యూటీలకు ఆటంకం కలిగించారని కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

For More News..

అడవిబిడ్డలకు అన్యాయం చేస్తే జైలుకు పంపిస్తా

16 ఏండ్లయినా పూర్తి కాని దేవాదుల ప్రాజెక్ట్

కరోనా భయంతో కోటి జంతువులను చంపేస్తున్న డెన్మార్క్