
- తమాషాలు చేస్తున్నారా?..ఎమ్మెల్యే వస్తున్నట్లు చెప్పలేదని
- షాద్‌నగర్ మున్సిపల్కమిషనర్పై చైర్మన్ ఫైర్
- రోడ్డుపైనే ఇద్దరి మధ్య వాగ్వాదం
షాద్ నగర్, వెలుగు:షాద్నగర్మున్సిపల్ కమిషనర్ వెంకన్నపై మున్సిపల్‌చైర్మన్ నరేందర్ మండిపడ్డారు. బుధవారం టౌన్‌లోని గవర్నమెంట్కాలేజీ వద్ద నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్వస్తున్నట్లు ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వెళ్లిపోగా, ఆలస్యంగా వచ్చిన మున్సిపల్చైర్మన్నరేందర్కమిషనర్వెంకన్నపై రోడ్డు మీదనే గరంగరం అయ్యారు.
‘ఏ తమాషాలు చేస్తున్నారా? మీ ఇష్టం వచ్చినట్లు కార్యక్రమం నిర్వహించుకుంటారా? ఎమ్మెల్యే వచ్చే విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఎమ్మెల్యేకు, నాకు మధ్య తగువు పెట్టి బద్నాం చేయాలని చూస్తున్నారా?’ అని మండిపడ్డారు. కమిషనర్ వెంకన్న స్పందిస్తూ ‘అన్ని విషయాలు నేను చెప్పలేను కదా? మేనేజర్ కు చెప్పమని చెప్పాను.’ అని సమాధానం ఇవ్వగా, చైర్మన్ నరేందర్ ఆగ్రహంతో చిటికెలు వేస్తూ ‘మేనేజర్’ అంటూ కేకలు వేశారు.
వీర్లపల్లి శంకర్నాకు కూడా ఎమ్మెల్యేనే.. మీరు ఇలా చేయడం పద్ధతి కాదంటూ అధికారులపై గరం అయ్యారు. కమిషనర్ కలగజేసుకుని ఏదైనా ఉంటే రివ్యూ చేసుకుందాం..ఇలా రోడ్లపై తిట్టుకుంటే ఎలా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పని చేస్తున్నామని ఇలా నిరుత్సాహపరిస్తే ఎలా అని అసహనం వ్యక్తం చేశారు. చైర్మన్ నరేందర్ సహా స్థానిక బీఆర్ఎస్ నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.