
ముషీరాబాద్, వెలుగు: సింగరేణిలో మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని అరుణోదయ సాంస్కృతి సమైక్య గౌరవాధ్యక్షురాలు విమలక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు విమలక్క మద్దతు తెలిపి మాట్లాడారు. గత 15 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
గతంలో మారుపేర్ల సమస్యను పరిష్కరించి విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని సింగరేణి యాజమాన్యం, కార్మిక జాతీయ సంఘాలు కలిసి లేబర్ కమిషన్ ఆర్ఎల్ సీ సమక్షంలో ఒప్పందం చేసుకున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సింగరేణి కుటుంబ వారసులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రవణ్, తిరుమల శ్రీనివాస్, ప్రదీప్ వర్మ, ఓం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.