వాట్సాప్‌ ద్వారా కార్పొరేషన్ సేవలందిస్తోన్న నగరాలివే

వాట్సాప్‌ ద్వారా కార్పొరేషన్ సేవలందిస్తోన్న నగరాలివే

మిలియన్ల మంది ఉపయోగిస్తోన్న వాట్సాప్ ద్వారా కొన్ని రాష్ట్రాలు సేవలు అందిస్తున్నాయి.  అవసరమైన సేవలను యాక్సెస్ చేయడం, జనన, మరణ ధృవీకరణ పత్రాలు పొందడం, ఇంటింటికీ చెత్త సేకరణ నుంచి ఫిర్యాదులను నమోదు చేయడం వరకు, అనేక రాష్ట్రాల్లో ఇతర సేవలు ఇప్పుడు వాట్సాప్‌లోని ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్ వల్ల ఫిర్యాదులను పరిష్కరించే సమయం తగ్గడంతో ప్రజల నుంచి ఈ సేవలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ టెక్నాలజీతో తక్కువ సమయంలో ఎక్కువ సేవలు అందించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ పద్దతిని పలు రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి. మంచి ఫలితాలను పొందుతున్నాయియ

కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్

ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అనుకూలమైన వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఈ చాట్‌బాట్ ద్వారా, కోల్‌కతా పౌరులు ప్రాపర్టీ మ్యుటేషన్ ప్రాసెస్, సర్టిఫికెట్ల నమోదు, మేయర్‌తో నేరుగా చాట్ చేసే సదుపాయంతో సహా అనేక ఇతర సేవల సదుపాయం కల్పిస్తోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేసి కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌కి “హాయ్” చెప్పండి:   http://wa.me/+918335999111

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాట్సాప్‌లో MyBMC అసిస్ట్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఇది వివాహ ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేయడం, జనన, మరణ ధృవీకరణ పత్రాలను యాక్సెస్ చేయడం, లైసెన్స్‌ల పునరుద్ధరణ వంటి మొదలైన వివిధ పరిష్కారాలకు తోడ్పడుతుంది. అత్యవసర సమయంలో సంప్రదించడానికి, చాట్‌బాట్ స్పీడ్ డయల్ నంబర్ 1916ను కూడా  అందిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేసి BMCకి “హాయ్” చెప్పండి:  http://wa.me/+918999228999

పూణే  మున్సిపల్ కార్పొరేషన్

మహిళా శిశు సంక్షేమ పథకం, మహిళా సాధికారత పథకం, యువజన సంక్షేమ పథకం మొదలైన PMC పథకాలపై పూణే నివాసితులకు తాజా సమాచారం అందించడానికి పూణే మున్సిపల్ కార్పొరేషన్ తన వర్చువల్ అసిస్టెంట్‌ను ప్రారంభించింది. వ్యర్థాల సేకరణ వంటి విస్తృత అవసరాలలో పౌరుల ఫిర్యాదులను పరిష్కరించడం ఈ సేవ లక్ష్యం . పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, క్లియరింగ్ - మురుగునీరు చేరడం, నిర్మాణ వ్యర్థాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయడం, వ్యర్థాలను కాల్చడం వంటి ఫిర్యాదులను వాట్సాప్ ద్వారా అడగవచ్చు. దాంతో పాటు కావల్సిన సర్టిఫికేట్లు, NOCలను కూడా పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేసి PMCకి “హాయ్” చెప్పండి:  http://wa.me/+918888251001

పాట్నా మున్సిపల్ కార్పొరేషన్

పాట్నా మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవలే  వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. ఇది ప్రజలకు త్వరితంగా, ప్రామాణికమైన సమాచారం అందించడంలో సహాయపడుతుంది. పౌరులు తమ వాహనాలను ట్రాక్ చేయడానికి, ప్రాపర్టీ అసెస్‌మెంట్ కోసం అభ్యర్థనలను రూపొందించడానికి, ప్రాపర్టీ ఐడెంటిటీ నంబర్ (PID) ఆధారిత చెల్లింపులు మొదలైనవాటిని వాట్సాప్ ద్వారా చేసే వీలు కల్పించింది. చెత్త డంప్‌లు, వీధి దీపాలు పనిచేయకపోవడం, నీటి లీకేజీలు మొదలైన ఇతర పౌర సమస్యలపై కూడా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేసి పాట్నా మున్సిపల్ కార్పొరేషన్‌కి “హాయ్” చెప్పండి:  https://wa.me/+919264447449

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 

వాట్సాప్‌లో ఫిర్యాదుల పరిష్కార కోసం అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  చాట్ సేవను ప్రారంభించింది, ఇది ఫిర్యాదు నమోదు, వాటి ప్రాసెస్ ను తెలుసుకోవడం వంటి వాటిని చేసుకునే అవకాశం కల్పిస్తుంది. చాట్‌బాట్ ప్రాపర్టీ ట్యాక్స్ బిల్లులను సులువుగా చెల్లించేందుకు యాక్సెస్‌ కూడా చేస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేసి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కి “హాయ్” చెప్పండి:  http://wa.me/+917567855303

కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ 

ఇది ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ చాట్‌బాట్‌ను ప్రారంభించిన మొదటి అర్బన్ లోకల్ బాడీ (ULB). ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం, పన్ను చెల్లింపులు, అభిప్రాయాన్ని, సూచనలను పంచుకోవడం లాంటి వంటి అనేక రకాల సేవలపై సత్వర, సులభ సహాయం పొందేందుకు ఇది పని చేస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేసి కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్‌కి “హాయ్” అని చెప్పండి:  http://wa.me/+919100030250