కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి : ఎమ్మెల్సీ అంజిరెడ్డి

కేంద్ర నిధులతోనే మున్సిపాలిటీల అభివృద్ధి : ఎమ్మెల్సీ అంజిరెడ్డి

జహీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలో బుధవారం బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం ఇచ్చే నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు వెళ్తోందని తెలిపారు. 

బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీ ఇన్​చార్జి సుభాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జగన్నాథ్, రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గొల్ల భాస్కర్, పట్టణ అధ్యక్షుడు పూల సంతోష్, సీనియర్ నాయకులు రమేశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, విజేందర్ రెడ్డి, మల్లికార్జున పాటిల్ తదితరులు పాల్గొన్నారు.