రెండు మూడ్రోజుల్లో మున్సిపోల్స్ నోటిఫికేషన్ : మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి

రెండు మూడ్రోజుల్లో  మున్సిపోల్స్ నోటిఫికేషన్ : మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
  •     ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్: ఉత్తమ్ 
  •     సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక  
  •     పైరవీలు నడ్వవన్న మంత్రి 

నిజామాబాద్,  వెలుగు: రెండు మూడ్రోజుల్లో  మున్సిపల్​ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్, బోధన్​ మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ ​ముఖ్య కార్యకర్తల మీటింగ్‌‌ నిజామాబాద్‌‌లో నిర్వహించారు. ఆర్మూర్, భీంగల్​కార్యకర్తల మీటింగ్ ఆర్మూర్‌‌‌‌లో నిర్వహించారు. ఈ రెండు సమావేశాల్లో ఉత్తమ్ మాట్లాడారు. ‘‘మున్సిపాలిటీల్లో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. సర్వేలు, ప్రజల అభిప్రాయాల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తాం. నిజామాబాద్​ కార్పొరేషన్​పరిధిలో మస్తాన్​ సర్వే చేస్తారు. 

ఆయనకు ఇన్‌‌పుట్స్​ఇవ్వండి. టికెట్ల కోసం ఎవరూ పైరవీలు చేయనక్కర్లేదు. కచ్చితంగా గెలిచేవాళ్లనే  నిలబెడతాం. ఎవరికి అవకాశం వచ్చినా అందరూ కలిసి గెలిపించాలి. టికెట్​రాని వారికి  ఇతర నామినేట్​ పదవులు ఇచ్చి న్యాయం చేస్తాం. కష్టపడే కార్యకర్తలను గుర్తించి గౌరవించేది కేవలం కాంగ్రెస్​మాత్రమే” అని అన్నారు. మూడు వార్డులకొక బాధ్యుడిని నియమించాలని, ప్రచార బాధ్యత వారికి అప్పగించాలని డీసీసీ నేతలకు సూచించారు. ప్రతి ఓటును కీలకంగా భావించాలని, పోల్​మేనేజ్‌‌మెంట్​కోసం నిపుణులను నియమిస్తామని చెప్పారు. 

సమర్థులకే టికెట్: పీసీసీ చీఫ్ 

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం బీజేపీకి అలవాటైందని పీసీసీ చీఫ్​ మహేశ్​​గౌడ్ మండిపడ్డారు. ‘‘మేం హిందువుగా దేవుళ్లను పూజిస్తాం. కానీ దేవుడి పేరుతో ఓట్లు అడగం. అది కాంగ్రెస్ ​విధానం కాదు. మత రాజకీయాలు ప్రజలకు బువ్వపెట్టవు. కేవలం మతాన్ని అడ్డుపెట్టుకొని నిజామాబాద్​ ఎంపీగా అర్వింద్​ గెలిచారు. కరీంనగర్ కంటే పాతదైన నిజామాబాద్‌‌ను స్మార్ట్​ సిటీగా ఎందుకు చేయలేదో ఆయన చెప్పాలి” అని ప్రశ్నించారు. 

మున్సిపల్​ఎన్నికల్లో టికెట్ల కోసం పైరవీలు చేయొద్దని, సమర్థులైతే గుమ్మం దగ్గరికే  బీఫామ్ వస్తుందని స్పష్టం చేశారు. కొన్నిసార్లు అందరికీ న్యాయం చేయలేమని, ఓపికతో ఉండాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్​ రాకున్నా ఓపికతో ఉన్నందుకే, తాను పీసీసీ ప్రెసిడెంట్ అయ్యానని పేర్కొన్నారు.