మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం : కేటీఆర్

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం : కేటీఆర్

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలపై అన్ని జిల్లాల ముఖ్య నేతలతో చర్చించామని తెలిపారు TRS పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. తెలంగాణభవన్‌ లో శుక్రవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. సమావేశం తర్వాత కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని ఎన్నికల్లో ప్రజలు TRSకు మంచి మెజారిటీ ఇచ్చారని.. 2014 కంటె 2018లో మరింత మెజారిటీ ఇచ్చారని తెలిపారు. ఇప్పడు ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్‌ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని తెలిపారు.

ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉందని.. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పల్లెలు, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. ఈ క్రమంలోనే రాష్ట్రం ఏర్పడ్డాక పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపల్ చట్టాలు తీసుకొచ్చామని చెప్పారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రజా ప్రతినిధులు విధులు గుర్తు చేయడంతో పాటు ..తమ విధులు నిర్వర్తించకుంటె ఎం జరుగుందో చేసి చూపించామన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేశామన్న ఆయన.. సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమ ఎజెండా అన్నారు. మున్సిపాలిటీలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్న కేటీఆర్..సీఎం కూడా పార్టీ ముఖ్య నేతలో కొద్దిరోజుల్లో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.