హుజూర్ నగర్,వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో ఉంటాయని రాష్ట్ర ఇరిగేషన్ సివిల్ సప్లై ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచనప్రాయంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు తెలిపారు. మంగళవారం మంత్రి ఉత్తమ్ క్యాడర్‌తో మాట్లాడుతూ.. జనవరి నెలాఖరులో కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.అసెంబ్లీ సమావేశాలు ముగియగానే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల ఎంపిక,ప్రచారం అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
