బషీర్‌బాగ్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు పై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తమ వైఖరి ప్రకటించాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు బాలగోని బాల్‌రాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో 17 శాతానికి తగ్గించి మోసం చేశారని మండిపడ్డారు. కో -కన్వీనర్లు వెంకన్న, విజయ్‌కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్ విడుదలైతే, మరుసటి రోజునుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఫ్రంట్ నేతలు బైరి శేఖర్, అంబాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
