జరిగింది మున్సిపల్​ సర్వే.. చెప్పుడెేమో కేటీఆర్​ సీఎం అవుతాడని

జరిగింది మున్సిపల్​ సర్వే.. చెప్పుడెేమో కేటీఆర్​ సీఎం అవుతాడని

హుజూరాబాద్​,వెలుగు :  టీఆర్​ఎస్​ నాయకులు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని తెలిపారు ఎంపీ బండి సంజయ్. “కేటీఆర్​ ఎక్కడ పుట్టాడో తెలియదు. ఎక్కడ పెరిగేయాడు తెలియదు. కానీ బీజేపీ మాత్రం వంద సంవత్సరాల నుంచి ఇలానే ఉందని చెబుతున్నాడు. నేడు దేశంలో 303 మంది ఎంపీలు బీజేపీ వాళ్లే ఉన్నారు. కేసీఆర్​, కేటీఆర్​, కవితలు భాషను నేర్చుకొని ప్రజలకు పిట్ట కథలు చెబుతున్నా.. ప్రజలు మాత్రం వాస్తవాలను గుర్తిస్తారు. టీఆర్​ఎస్​ హాయంలో నాయకులు అక్రమ ధనార్జనే ధ్యేయంగా సంపాదిస్తున్నారు. ఇసుక, డబుల్​ బెడ్రూంల పేరిటా డబ్బులను సంపాదిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర స్కీం పేరిటా డబ్బులను దండిగా సంపాదించి తెరపైకి మున్సిపల్​ ఎన్నికలను తీసుకొచ్చారు.

తప్పుల తడకగా ఓటర్ల జాబితా

వార్డుల, డివిజన్ల విభజనలో తమకు అనుకూలమైన నాయకులకు రిజర్వేషన్​లు వచ్చేలా ప్రభుత్వం తప్పుడు చర్యలు చేపడుతుంది. టీఆర్​ఎస్​ ప్రభుత్వం నిజంగా అభివృద్ది చేసి నిజాయితీగా గెలువాలి తప్ప.. అడ్డదారిలో రావడం ఏమిటాని ప్రశ్నించారు.  ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న టీఆర్​ఎస్​ ప్రభుత్వం.. ఎన్నికల్లో గెలిచే సత్తా లేకనే తప్పుడు దారిలో ప్రయాణిస్తుంది.  బీజేపీకి టీఆర్​ఎస్​కు పోటీ కాదు.. బీజేపీకి ఎంఐఎంకు మధ్య పోటీ ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎం గెలిస్తే టీఆర్​ఎస్​ గెలిచినట్టేనని భావిస్తున్నారు. మైనార్టీ ఓట్ల ద్వారా టీఆర్​ఎస్​ పార్టీ గెలిచేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉంది. మంత్రి ఈటల రాజేందర్​ ఎప్పడు కూడా నిర్భయంగా నిజలు, వాస్తవాలే మాట్లాడుతారు. ఆయనను మోసం చేసింది కూడా నిజమే.  పట్టణాల, గ్రామాలాభివృద్ది కేంద్ర ప్రభుత్వ నిధులతో, రాష్ర్ట ప్రభుత్వ నిధులతో జరిగిందాన్న విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్​ చెబితే ఆయనకు మద్దతు తెలుపుతాం. హుజూరాబాద్​, జమ్మికుంట మున్సిపాలీటీలో చైర్మన్​లు రాజీనామా చేయడం ద్వారానే అర్థమవుతుంది. అవినీతి ఎక్కడ జరుగుతుందో.  అభివృద్ది మొత్తం జరిగింది కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే.  కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు చేపడుతూ మేమే పనిచేశామని రాష్ర్ట  ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. పట్టణంలో జరిగిన అభివృద్ది పనులపై టీఆర్​ఎస్​ శ్వేత పత్రం విడుదల చేయాలి.

జరిగింది మున్సిపల్​ సర్వే.. చెప్పుడెేమో కేటీఆర్​ సీఎం అవుతాడని

అభివృద్ది పనులకు నిధులు లేవు పనులు ఆపమని కేసీఆర్​ చెప్తే.. తిరిగి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు మొదలు పెట్టేందుకు డబ్బులు ఎక్కడవి.. ప్రజలు ఏం నమ్మి మీకు ఓటేయాలో ప్రజలకు సమాధానం ఇవ్వాలి. అభివృద్ది గ్రహించే ప్రజలు పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు. కేటీఆర్​ను సీఎం చేసుడు.. ఆ పార్టీ నాయకులే ఒప్పకోరూ.. జరిగింది మున్సిపల్​ సర్వే.. చెప్పుడెమో కేటీఆర్​ సీఎం అవుతాడని ఆ నాయకులు చెప్పడు. టీఆర్​ఎస్​ ఎంఐఎం పార్టీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని మైనార్టీ ఓట్లను రాబట్టేందుకు మాస్టర్​ ప్లాన్​ రూపొందించింది” అని తెలిపారు బండి సంజయ్.