హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ కార్యదర్శిగా రేండ్ల తిరుపతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా స్పీకర్ ప్రసాద్‌ను, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. గతంలో అసెంబ్లీకి, కౌన్సిల్‌కు ఒకరే కార్యదర్శిగా వ్యవహరించారు. అయితే, ఇటీవల అసెంబ్లీకి, కౌన్సిల్‌కు వేర్వేరుగా కార్యదర్శులు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని, ఈ నియామకం చేపట్టారు.
తిరుపతి రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటివరకు అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న నర్సింహాచార్యులు శనివారం నుంచి కౌన్సిల్ కార్యదర్శిగా విధులు నిర్వర్తించనున్నారు.
