రూఫస్తో ఈజీగా షాపింగ్

రూఫస్తో ఈజీగా షాపింగ్

న్యూఢిల్లీ: అమెజాన్ తన వినియోగదారులకు పండుగ సీజన్ సందర్భంగా ఏఐ  ఆధారిత రూఫస్ షాపింగ్ అసిస్టెంట్​ను పరిచయం చేసింది. దీని సాయంతో నవరాత్రి, ఉగాది, ఈద్ పండుగలకు కావాల్సిన వస్తువులను సులభంగా వెతుక్కోవచ్చు. రూఫస్ ద్వారా గత 90 రోజుల ధరల చరిత్రను తెలుసుకునే వీలుంది. వస్తువుల ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడానికి ప్రైస్ అలర్ట్ పెట్టుకోవచ్చు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో అమెజాన్ నౌ ద్వారా 10 నిమిషాల్లోనే డెలివరీ పొందవచ్చని కంపెనీ తెలిపింది.