నిర్మల్ జిల్లాలో నాయక్ పోడ్ సంఘం ప్రెసిడెంట్ గా సంగెం లక్ష్మి

నిర్మల్ జిల్లాలో  నాయక్ పోడ్ సంఘం ప్రెసిడెంట్ గా సంగెం లక్ష్మి

లోకేశ్వరం, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలో టీఎన్ జీవో భవనంలో శుక్రవారం జిల్లా ఆదివాసీ నాయక్ పోడ్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ సర్పంచ్ సంగెం లక్ష్మిని జిల్లా ఆదివాసీ నాయక్ పోడ్ సంఘం అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి జిల్లా పదవి అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీ నాయక్ పోడ్​ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. 

మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక

నర్సాపూర్(జి), వెలుగు: నర్సాపూర్(జి) మండల సర్పంచ్​ల ఫోరం కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా లలిత, అధ్యక్షుడిగా గడ్డం ఇంద్రకరణ్ రెడ్డిని  ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా చెన్న వసంత లస్మయ్య(గొల్లమాడ), జనరల్ సెక్రటరీగా ప్రవీణ్ కుమార్(కుస్లి), జాయింట్ సెక్రటరీగా అరుణ్ లాల్(బూరుపల్లి), ట్రెజరర్ గా చందాల మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.