
ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను లంకెలపల్లిదాకా గుంజుకొచ్చామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించేదన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, రుణమాఫీ జరగాలంటే బీజేపీని గెలిపించాలన్నారు. ఒక్కో ఓటుకు 40 వేల రూపాయలు ఇచ్చి మంత్రులను కేసీఆర్ పంపించాడని సంజయ్ ఫైర్ అయ్యారు. మంత్రులు మందు, చిందులతో మీటింగ్ లు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పాస్ పోర్టుల బ్రోకర్ అని బండి సంజయ్ ఆరోపించారు.
అప్పులు కట్టకపోతే కేసీఆర్ రథాన్ని గుంజుకుపోయారని, కేసీఆర్ కారును మంజీరా బ్యాంక్ వాళ్లు తీసుకెళ్లారని బండి సంజయ్ అన్నారు. అప్పులలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు విమానం ఎలా కొంటాడని ప్రశ్నించారు. మునుగోడుతో కేసీఆర్ పతనం మొదలైందన్నారు . కేసీఆర్ అవినీతి సొమ్మును మోడీ, అమిత్ షా కక్కిస్తారన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గట్టుపల్ మండలం వచ్చింది, రోడ్డు, పింఛన్లు, గొర్ల యూనిట్, గిరిజన బందు వచ్చాయన్నారు. గొర్ల యూనిట్,దళిత బందు బ్యాంక్ ఖాతాలో వేసిండు ఎన్నికలు అయిపోగానే రిటర్న్ తీసుకుంటాడన్నారు. డ్రంక్ డ్రైవ్ టెస్ట్ పెట్టి గౌడ్స్ ను రోడ్ల పాలు చేసిండన్నారు. తెలంగాణలో పద్మశాలిల పరిస్థి దారుణం ఉందన్నారు. అగ్రవర్ణాల పేదలను కూడా కేసీఆర్ ఇబ్బంది పెట్టిండన్నారు. కేసీఆర్ మీద ఉన్న కసి ఓటుతో చూపించాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబ మొత్తం నాయకులు అయ్యారని విమర్శించారు.