మునుగోడు బైపోల్ రెండో రౌండ్ ఫలితం

మునుగోడు బైపోల్ రెండో రౌండ్ ఫలితం

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. ఫలితం రాక కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు నేడు తెర పడనుంది. ఉప ఎన్నికలో తమదే విజయమని ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 

రెండో రౌండ్‭  : రెండో రౌండ్ లో అనూహ్యంగా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. 13,648లకు పైగా ఓట్లతో బీజేపీ ముందంజలో ఉంది. టీఆర్ఎస్ కు14,211 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‭కు 3వేల 597 ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్ ముగిసిన తర్వాత 563 ఓట్లతో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం
పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబర్చింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి బీజేపీ కంటే నాలుగు ఓట్లు అధికంగా పోలయ్యాయి. ఉప ఎన్నికలో మొత్తం 686 పోస్టల్‌ ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ పార్టీకి 228 ఓట్లు రాగా, బీజేపీ 224, బీఎస్పీ 10, ఇతరులకు 88 పోలవగా, మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి.