పదేండ్ల పాలనలో వేలకోట్లు దోచుకున్న బీఆర్ఎస్ : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

పదేండ్ల పాలనలో వేలకోట్లు దోచుకున్న బీఆర్ఎస్ : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  •     మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, వెలుగు : పదేండ్ల టీఆర్ఎస్ పాలనలో వేల కోట్లు దోచుకుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలంలో పంచాయతీ మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం బీఆర్ఎస్  అభ్యర్థి భూకబ్జా దారుడని, ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. 

కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ బాబు ధర్మం వైపు ఉన్నాడని, ఇంకా తమ ప్రభుత్వం మూడేండ్లు ఉంటుందని, అతనికి ఓటు వేయాలని కోరారు. నిజాయతీగా ప్రజా సేవ చేయాలని లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, అక్రమ సొమ్ము, అధర్మం వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉండడని, అతని అనుచరులు కూడా అక్రమం వైపు నిలబడరని పేర్కొన్నారు.  కాంగ్రెస్ నేత పబ్బు రాజుగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెంకటయ్య ఉన్నారు.