
హైదరాబాద్ : ఓ వ్యక్తిని పట్టపగలే వేట కొడవలితో అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన పఠాన్ చెరులోని రుద్రారంలో జరిగింది. ముషీరాబాదుకు చెందిన మెహబూబ్ బాషా..శుక్రవారం ఉదయం సంగారెడ్డి నుండి కోర్టు కేసుకు హాజరై, తిరిగి వస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బైకు పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలితో మెహబూబ్ భాషను నరికి చంపి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం హస్పిటల్ కు తరలించారు.
ఈ సంధర్బంగా sp చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..మృతుడు ముషీరాబాదుకు చెందిన వ్యక్తిగా గుర్తించామని..మెహబూబ్ భాష గతంలో హర్షద్ ఉసేన్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా గుర్తించారు. అక్రమ రేషన్ బియ్యం మాఫియాలో ప్రధాన సూత్ర దారుడని ఈ క్రమంలో హత్య జరిగిందా అని అనుమానిస్తున్నామన్నారు. అన్ని కోణాలనుండి కేసును పరిశీలిస్తున్నామని సంగారెడ్డి ఎస్పీ మీడియాకు తెలిపారు.