
తమిళ హీరో విజయ్ ఆంటోనీ 'హత్య' అనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లోటస్ పిక్చర్స్, ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ, సంధ్య అనే పోలీస్ అధికారిణి పాత్రలో రితికా సింగ్ కనిపించనుంది.
తాజాగా ఈ చిత్రం నుంచి నటుడు మురళీ శర్మ పాత్రను వదిలారు చిత్రబృందం. ఏజెంట్ ఆదిత్యగా ఆయన కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. లీలను చంపింది ఎవరు అనే కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఏజెంట్ ఆదిత్యగా రంగంలోకి దిగారు మురళీ శర్మ . పోస్టర్ లుక్ లో ఆయన ఎంతో ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. కాంట్రాక్ట్, స్లీజీ, వై అనే ప్రశ్నల ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మురళీ శర్మ లుక్ డిఫరెంట్ గా ఉంది.