
క్యాచ్ మిస్సైపోయేదేమోనని తన తోటి ప్లేయర్‌ను స్టేడియంలోనే కొట్టినంత పనిచేశాడు టీం కెప్టెన్. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో బంగాబంధు ట్వంటీ 20 కప్ సందర్భంగా బెక్సింకో ధాకా మరియు ఫార్చ్యూన్ బారిషాల్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో జరిగింది. బెక్సింకో ధాకా టీంకు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఫార్చ్యూన్ బారిషాల్ ఆటగాడు బాల్‌ను కొట్టగా.. పైకి లేచింది. వికెట్ కీపర్ నాసుమ్ అహ్మద్‌తో పాటు ముష్ఫికర్ రహీమ్ క్యాచ్ కోసం పరుగెత్తారు. అయితే వీరిద్దరూ ఒకరినొకరు ఢీకొనడంతో.. నాసుమ్ క్యాచ్ కోసం ప్రయత్నం విరమించుకున్నాడు. కానీ.. ముష్పికర్ మాత్రం క్యాచ్ వదల్లేదు. ఆ తర్వాత క్యాచ్ మిస్సైపోయేదేమోనని ఆగ్రహించిన ముష్పికర్.. నాసుమ్ మీదికి బాల్ విసిరాడు. అంతేకాకుండా.. నాసుమ్‌ను కొట్టినంతపనిచేశాడు. దాంతో ముష్పికర్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బంగ్లాదేశ్ తరపున ఎన్నో రికార్డులు సాధించిన ముష్పికర్ చేసిన పనికి మ్యాచ్ రిఫరీ కోప్పడ్డారు. ముష్పికర్‌కు మ్యాచ్ ఫీజులో నాలుగింట ఒక వంతు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు జరిమానా విధించింది. ‘మేం అతని ట్రాక్ రికార్డ్‌ను పరిగణించాము. అది చాలా బాగుంది. మరోసారి ఇటువంటి చర్య పునరావృతమైతే ఇబ్బందుల్లో పడతాడు’ అని మ్యాచ్ రిఫరీ రోకిబుల్ హసన్ హెచ్చరించాడు.
‘మంగళవారం జరిగిన సంఘటనకు సంబంధించి నా అభిమానులు మరియు ప్రేక్షకులందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఆట తర్వాత నా జట్టు సహచరుడు నాసుమ్‌కు క్షమాపణ చెప్పాను. నేను కూడా మానవమాత్రున్నే. నేను చేసిన పని ఆమోదయోగ్యం కాదు. ఇది పునరావృతం కాదని హామీ ఇస్తున్నాను’ అని ముష్ఫికర్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశాడు.
ఈ టోర్నమెంట్‌కు సంబంధించి డిసెంబర్ 18న ఫైనల్ జరగనుంది. ఆ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ బెక్సింకో టీం తప్పకగెలవాల్సిన మ్యాచ్. అందుకే ముష్పికర్ ఇంతలా రియాక్ట్ అయ్యాడేమో అని నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి బెక్సింకో టీం బారిషాల్ టీం మీద తొమ్మిది పరుగుల తేడాతో గెలిచి.. ఫైనల్‌కు చేరుకుంది.
For More News..