మూసి ప్రాజెక్ట్ కు వరద తాకిడి.. 9 గేట్లను ఎత్తారు..

మూసి ప్రాజెక్ట్ కు వరద తాకిడి.. 9 గేట్లను ఎత్తారు..

 తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రాజెక్ట్‌లు, నదులు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. తాజాగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మూసీ వరద నీటితో నిండిపోయింది. దీంతో, అధికారులు..  మూసీ ప్రాజెక్ట్‌ గేట్లను ఎత్తారు. దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

 మూసీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. 9 క్రస్ట్ గేట్లను  2 ఫీట్ల మేరకు  పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు...  మూసీ 9 క్రస్ట్​  గేట్ల ద్వారా 11945.44క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.  ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతానికి 643 అడుగులకు వరదనీరు చేరుకుంది.  ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటి మట్టం  643.66 అడుగులు.. మూసీ ప్రాజెక్ట్​లోకి ఇన్​  ఫ్లో 9166.22 క్యూసెక్కులుగా కొనసాగుతుందని ప్రాజెక్ట్​ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం - 4.46 TMC లు కాగా .. ప్రస్తుతానికి 4.11 TMC లకు వరద నీరు చేరింది. 

Also Read :  కడెం దడ పుట్టిస్తోంది.. జలాశయం నిండింది.