మూసీ రివర్ ఫ్రంట్ డీపీఆర్ రెడీ...ప్రతిపక్ష పార్టీలకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

మూసీ రివర్ ఫ్రంట్ డీపీఆర్ రెడీ...ప్రతిపక్ష పార్టీలకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు:  మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి తొలి దశలో చేపట్టే పనుల డీపీఆర్ రెడీ అయ్యిందని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. గురువారం రాత్రి పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి బదులుగా ఆ శాఖ వివరాలను మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఉస్మాన్ సాగర్– హిమాయత్ సాగర్ నుంచి గౌరెల్లి వరకు 52 కిలోమీటర్ల దూరం చేపట్టబోయే మూసీ పునరుద్ధరణ పనులను ఐదు అభివృద్ధి జోన్లుగా చేశామన్నారు. 

ఇందులో భాగంగా జూన్ 1న 21 కిలోమీటర్ల దూరం చేపట్టబోయే పనులకు డీపీఆర్ రెడీ అయిందని త్వరలో నే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ డీపీఆర్ పత్రాలను ప్రతిపక్ష పార్టీలకు అందజేస్తామన్నారు.