మ్యూజిక్ లెజెండ్స్‌‌ సెల్ఫీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పిక్

మ్యూజిక్ లెజెండ్స్‌‌ సెల్ఫీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పిక్

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇద్దరు సంగీత దిగ్గజాలు కలిసి ఒక సినిమాకు వర్క్‌‌ చేయడంతో పాటు ఒకే ఫ్రేమ్‌‌లో కనిపిస్తే ఎలా ఉంటుందో పై ఫొటోలో చూడొచ్చు. అందులో ఒకరు భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి ఆస్కార్‌‌‌‌ లాంటి గౌరవాలను అందుకున్న ఏఆర్‌‌‌‌ రెహమాన్ కాగా, మరొకరు హాలీవుడ్ మ్యూజిక్ లెజెండ్, ఆస్కార్ విన్నర్ హాన్స్ జిమ్మర్. గ్లాడియేటర్‌‌‌‌, ది లయన్ కింగ్, ఇన్‌‌సెప్షన్, ది పైరెట్స్‌‌ ఆఫ్​ కరేబియన్,  ఇంటర్‌‌‌‌స్టెల్లార్‌‌‌‌, డ్యూన్‌‌, ది డార్క్ నైట్‌‌ లాంటి  ఎన్నో హాలీవుడ్ సినిమాల విజయంలో కీలకపాత్ర  పోషించిన జిమ్మర్.. ‘రామాయణ’ చిత్రంతో ఇండియన్ సినిమాకు పరిచయం అవుతున్నారు. 

వీళ్లిద్దరూ కలిసి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌‌గా ‘రామాయణ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదలైన నేపథ్యంలో హాన్స్ జిమ్మర్‌‌తో కలిసి ఉన్న ఈ ఫోటోను రెహమాన్‌‌ తన సోషల్ మీడియా అకౌంట్‌‌లో పోస్ట్‌‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు, సినీ అభిమానులు ఈ ఫొటోకు కామెంట్స్ రూపంలో అభినందనల జల్లు కురిపిస్తున్నారు.  రాముడిగా రణబీర్ కపూర్‌‌‌‌,  రావణుడిగా యశ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని నితేష్ తివారీ ద‌‌ర్శకత్వంలో న‌‌మిత్ మ‌‌ల్హోత్రా నిర్మిస్తున్నారు. రెండు పార్టులుగా రూపొందుతుండగా ఫ‌‌స్ట్ పార్టు వ‌‌చ్చే ఏడాది దీపావ‌‌ళి కానుక‌‌గా విడుద‌‌ల కానుంది.