Music Shop Murthy: మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ.. కంటెంట్ కొత్తగా ఉంది!

Music Shop Murthy: మ్యూజిక్ షాప్ మూర్తి రివ్యూ.. కంటెంట్ కొత్తగా ఉంది!

టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్(Ajay ghosh) మెయిన్ లీడ్ లో వచ్చిన మూవీ మ్యూజిక్ షాప్ మూర్తి(Music shop murthy). కొత్త దర్శకుడు శివ పాలడుగు(Siva paladugu) తెరకెక్కించిన ఈ సినిమాలో సీనియర్ నటి ఆమని, యంగ్ బ్యూటీ చాందినీ చౌదరి, భానుచందర్ కీ రోల్స్ చేశారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు(జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రధాన పాత్రలో అజయ్ ఘోష్ ఏమేరకు మెప్పించాడు? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.


కథ:
మూర్తి(అజయ్ ఘోష్) ఓ మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. ఫంక్షన్స్ కి సౌండ్ సెటప్ చేసి పాటలు ప్లే చేస్తూ ఉంటాడు. అయితే ఆ మ్యూజిక్ షాప్ నుండి పెద్దగా సంపాదన లేకపోవడంతో.. భార్య(ఆమని) ఆ మ్యూజిక్ షాప్ అమ్మేసి సెల్ ఫోన్ షాప్ పెట్టుకుందాం అంటూ గొడవ పెడుతుంది. ఒకరోజు.. మూర్తి ఒక ఫంక్షన్ లో ప్లే చేసిన పాటలు బాగుండటంతో అక్కడికి వచ్చిన వారందరూ మూర్తిని అభినందించి.. DJ అయి ఉంటే బాగుండేది అంటూ సలహా ఇస్తారు. అంతేకాదు.. DJ అయితే సంపాదన కూడా బాగానే ఉంటుందని సలహా ఇస్తారు. దాంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడు మూర్తి. అలా మూర్తికి అంజనా(చాందిని చౌదరి) పరిచయం అవుతుంది. ఆతరువాత మూర్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి మూర్తి DJ అయ్యాడా? ఇంతకీ అంజనా ఎవరు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ:
ఒక వ్యక్తి తన డ్రీం కోసం వయసు సంబంధం లేకుండా ప్రయాణం చేయడం అనే కాన్సెప్ట్ తో ఇప్పటికి చాలా సినిమాలే వచ్చాయి. మ్యూజిక్ షాప్ మూర్తి కూడా అలాంటిదే. కానీ, ఈ సినిమాలో పాయింట్ కాస్త కొత్తగా ఉంటుంది. 50 ఏళ్ళ వయసున్న ఒక వ్యక్తి dj అవుదాం అనుకోడం అనే పాయింటే ముందుగా నవ్వుతెప్పిస్తుంది. కథనం కూడా అలానే సాగింది ఫన్నీగా. సినిమా మొదట కాస్త స్లోగా సాగినా.. చాందిని ఎంట్రీ తరువాత ట్రాక్ ఎక్కుతుంది. చాందిని పరిచయం తరువాత, DJ నేర్చుకోవడం, ఇంట్లో కష్టాలు, భార్య ఈసడింపులు ఇలా ఎంతెర్తైనింగ్ గా సాగుతుంది. అలా ఇంటర్వెల్ దగ్గర ఎమోషనల్ ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ పైట ఆసక్తిని కలిగించాడు. ఇక సెకండ్ హాఫ్ కూడా అదే ఎమోషన్ తో సాగుతుంది కథ. మూర్తి dj ఎలా అయ్యాడు అనే పాయింట్ కూడా ఆసక్తిగా చూపించారు. ఇక క్లైమాక్స్ లో ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టించి డీసెంట్ ఎండింగ్ ఇచ్చారు.   


నటీనటులు, సాంకేతిక నిపుణులు:
మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో మెయిన్  హైలెట్ అంటే అజయ్ ఘోష్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు విలన్ గా, కమెడియన్ గా చేసిన ఆయన మొదటిసారి మెయిన్ లీడ్ లో ఆకట్టుకున్నారు. ఓ 50 ఏళ్ళ మిడిల్ క్లాస్ వ్యక్తిగా, DJ అవ్వాలనుకునే వ్యక్తిగా పర్ఫెక్ట్ గా అదిరిపోయేలా నటించారు. ఇక ఎమోషనల్ సీన్స్ తో ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టించాడు అజయ్ ఘోష్. ఇక మోడ్రన్ అమ్మాయిగా, dj ఆర్టిస్ట్ గా చాందిని కూడా బాగానే నటించింది. సీనియర్ నటి ఆమని, భాను చందర్ తదితరులు పాత్రల మేర ఆకట్టుకున్నారు.

ఈ సినిమా నేపధ్యం సంగీతం కాబట్టి పవన్ కీలకంగా మారాడు. ఆయన అందించిన పాటలు మామూలుగానే ఉన్న బీజీఎమ్ మాత్రం ఆకట్టుకుంది. ఇక dj బీట్ లో వచ్చే మ్యూజిక్ కూడా చాలా బాగా అందించాడు పవన్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. శ్రీనివాస్ బేజిగం అందించిన విజువల్స్ సినిమాను రిచ్ గా కనిపించేలా చేశాయి. శివ పాలడుగుకు ఇది మొదటి సినిమానే అయినా చాలా చక్కగా డీల్ చేశాడు. తాను అనుకున్న కథని ఏమాత్రం జంకకుండా ప్రెజెంట్ చేశాడు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. .

ఇక మొత్తంగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా గురించి చెప్పాలంటే.. 50 ఏళ్ళ వ్యక్తి DJ అవ్వాలనుకొని, అందుకోసం ఆయన చేసిన ప్రయత్నం చాలా బాగుంది.