Anirudh Ravichander: ఆ అమ్మాయితో అనిరుధ్‌ ఇలా దొరికేశారేంటి? జస్ట్ రూమర్సే కాదు.. అంతకుమించి అంటా!!

Anirudh Ravichander: ఆ అమ్మాయితో అనిరుధ్‌ ఇలా దొరికేశారేంటి? జస్ట్ రూమర్సే కాదు.. అంతకుమించి అంటా!!

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichandar).. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ఇదే పేరు ట్రెండ్ అవుతోంది. తన ఎలక్ట్రిఫయింగ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ.. ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసే అనిరుధ్.. క్రేజీ మ్యాన్ అనిపించుకుంటున్నారు.

మనిషి చూడటానికి సన్నగా ఉంటాడు కానీ.. ఒక్కసారి మ్యూజిక్ ఇస్తే అంతే.. స్పీకర్లు పగిలిపోవడం ఖాయం. అలాంటి సెన్సేషనల్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం.. హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ ఓన‌ర్ కావ్య మార‌న్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఓ వీడియో బయటకొచ్చింది. వీరిద్దరూ ప్రేమ‌లో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని గతంలోనూ రూమర్స్ బాగా వినిపించాయి.

అయితే.. అనిరుధ్ 2025 జూన్లో ఒక X పోస్ట్ ద్వారా ఈ రూమర్స్ని తోసిపుచ్చారు. ‘మ్యారేజ్ హహహ.. చిల్ అవుట్ గాయ్స్.. రూమర్స్ ఆపండి’ అని రియాక్ట్ అయ్యాడు. అంతటితో ఆగిపోయాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఓ వీడియో బయటకి రావడంతో.. మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది అనిరుధ్ యవ్వారం. ప్రసెంట్ వివరాల్లోకి వెళితే.. 

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్ టీవీ వారసురాలు, కళానిధి మారన్ ఏకైక డాటర్ కావ్య మారన్తో రిలేషన్లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ జంట అమెరికా న్యూయార్క్ వీధుల్లో కలిసి తిరుగుతూ కనిపించారు. ఓ UK వ్లాగర్ తీసిన వీడియోలో అనుకోకుండా ఈ జంట చిక్కింది. ఈ క్రమంలో వీరి వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే వాళ్లు వెళ్లింది అమెరికాలోని న్యూయార్క్ కాదని, UK అని కూడా టాక్ వినిపిస్తుంది.

ఇపుడు ఈ వైరల్ వీడియోతో అనిరుధ్‌, కావ్య మార‌న్ల పెళ్లి వార్త‌లు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చాయి. సీక్రెట్ ల‌వ‌ర్స్ భ‌లే దొరికేశారంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ వీడియోపై అనిరుధ్ ఎలా స్పందిస్తాడో అనే ఆసక్తి నెలకొంది.

ఇకపోతే, అనిరుధ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ప్రతి ఇండస్ట్రీకి ఇతను బాగా కావాల్సిన వాడిగా మారాడు. రీసెంట్ టైమ్స్లో దేవర, వెట్టయన్, కూలీ సినిమాలతో టాలీ, కోలీవుడ్ ఆడియన్స్కి బూస్ట్ ఇచ్చాడు. అయితే, తన ఎక్కువ సినిమాలు సన్ టీవీ ఓనర్, కావ్య మారన్ ఫాదర్ కళానిధి మారన్ బ్యానర్లో పనిచేయడం విశేషం.

ప్రస్తుతం.. కావ్య మార‌న్‌ IPLలో హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌కు స‌హ య‌జ‌మానురాలిగా, ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. సోష‌ల్ మీడియాలో కావ్య మార‌న్‌కు భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ ద్వారా ఫేమ‌స్ అయిన ఈ బ్యూటీ.. క్రికెట్ టీమ్నే కొనేసింది అంటే.. తన ఆస్తి, పవర్ ఎంతుంటుందో ఊహించుకోండి!. ఈ రూమర్స్ కనుక నిజమైతే, అనిరుధ్ జాక్ పాట్ కొట్టేసినట్లే అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం అనిరుధ్.. అర డజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇక అనిరుధ్ అప్ కమింగ్ రిలీజ్ సినిమాలు 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK). నయనతార భర్త, విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ తమిళ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి హీరోహీరోయిన్స్గా నటిస్తున్నారు. డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

అలాగే, దళపతి విజయ్ 'జన నాయగన్' సినిమా రానుంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది. తెలుగులో నాని ప్యార‌డైజ్‌, ఎన్టీఆర్ దేవ‌ర 2 సినిమాల‌కు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.