తప్పు జరిగింది.. తిరిగి విధుల్లో చేరండి: ఎలాన్ మస్క్

తప్పు జరిగింది.. తిరిగి విధుల్లో చేరండి: ఎలాన్ మస్క్

శాన్‌ఫ్రాన్సిస్కో: సీఈఓ, సీఎఫ్ఓతో పాటు పలువురు ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కంపెనీ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గించేందుకు 3వేలకు పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపిన ట్విట్టర్.. తాజాగా వారిలో కొందరికి తిరిగి విధుల్లో చేరాలని ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది. కంపెనీ తొలగించిన ఉద్యోగుల లిస్టులో కొన్ని తప్పులు దొర్లాయని, ఆ కారణంగా కొందరినీ విధుల్లోంచి తొలగించాల్సి వచ్చిందని బ్లూమ్ బర్గ్ పేర్కొంది. అయితే తొలగించిన ఉద్యోగుల్లో కొందరి సేవలు తప్పనిసరని కంపెనీ భావిస్తున్నందునే వారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై ట్విట్టర్ మేనేజ్ మెంట్గానీ, ఎలాన్ మస్క్గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

సోషల్ మీడియా యాప్స్ కు పోటీగా ట్విట్టర్ ను తీర్చి దిద్దాలని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తొలగించిన సిబ్బందిని తిరిగి రమ్మని మెయిల్స్ పంపారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్విట్టర్ లో కొత్త ఫీచర్లు, మార్కెటింగ్, యాప్ డిజైనింగ్ డెవలప్ మెంట్ లలో మార్పుల కోసమే తొలగించిన వారిని తిరిగి రావాలని కోరినట్లు సమాచారం. అయితే ఎంతమందిని తిరిగి విధుల్లో చేర్చుకుంటారన్న అంశంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.