Twitter Elon Musk: ట్విట్టర్లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్

Twitter Elon Musk: ట్విట్టర్లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్

ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్.. ట్విట్టర్ లో తన పేరు మార్చుకున్నాడు. ఇదివరకు ఎలన్ మస్క్ గా ఉన్న తన పేరును ఇప్పుడు మిస్టర్ ట్వీట్ గా చేంజ్ చేసుకున్నాడు. తన పేరు మార్చుకున్న విషయాన్ని ట్విట్ ద్వారా వెల్లడించాడు. ఈ పేరుతో తనను ఒక లాయర్ పిలిచాడని, ఆ పేరు తనకెంతో నచ్చి ట్విట్టర్లో మార్చుకున్నట్లు చెప్పాడు. విషయంలోకి వెళ్తే..

అమెరికాలోని ట్విట్వర్ హెడ్ ఆఫీస్ సహా, పలు దేశాల్లోని ట్విట్టర్ కార్యాలయాలకు మస్క్ అద్దె కట్టడం లేదని, ఓనర్లంతా కోర్టులో కేసు పెట్టారు. ఒక కోర్టు కేసులో పిటిషనర్ తరుపు న్యాయవాది వాదిస్తూ మస్క్ ని ‘మిస్టర్ ట్వీట్’ అన్నాడట. ఆ పిలుపు బాగా నచ్చిన మస్క్ ట్విట్టర్ లో అదే పేరును పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మీ పేరును (ఎలన్ మస్క్) నా ట్విట్టర్ అకౌంట్ కి పెట్టుకుంటా’ అని సరదా కామెంట్లు పెడుతున్నారు.