Twitter: ట్విట్టర్ భవనాలకు రెంట్‌ కడ్తలేరు

Twitter: ట్విట్టర్ భవనాలకు రెంట్‌ కడ్తలేరు

ట్విట్టర్‌‌ను కొనుగోలు చేసిన దగ్గరనుంచి మస్క్‌ రోజుకొక వివాదంలో చిక్కుకుంటున్నాడు. తాజాగా కొన్ని ట్విట్టర్ వ్యవహారాల విషయంలో కోర్ట్‌ మెట్లు ఎక్కనున్నాడు. అమెరికా (శాన్‌ఫ్రాన్సిస్కో)లో ట్విట్టర్‌‌కు చెందిన ప్రధాన కార్యాలయంతో పాటు, బ్రిటన్‌లోని ఒక ట్విట్టర్ కార్యాలయానికి (భవనాలకు) మస్క్‌ అద్దె కట్టట్లేదని సంబంధిత భవన యజమానులు మస్క్‌ను కోర్టుకు లాగనున్నారు. 

44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ని సొంతం చేసుకున్న మస్క్‌ భారీ నష్టాల్లో ఉన్నాడని తెలుస్తుంది. ఈ విషయంలో ఏటా 100 కోట్ల డాలర్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. దీంతో మస్క్‌పై భారీగా ఆర్తిక భారం పడనుంది. ఇప్పటికే టెస్లా పెట్టుబడిదారులు కూడా మస్క్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావాను వేశారు. వీటన్నింటిని మస్క్ ఎలా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది.