
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ఎలెన్ మస్క్ ప్రకటిం చారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా సంస్థ ఎక్స్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అమెరికా ప్ర భుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందన్న మస్క్.. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్ నకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి తనస్వరాన్ని వినిపిం చారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల.. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభి ప్రాయం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వ్యయాలను తగ్గిం చడానికి డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృథా అవుతాయని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతోనే మస్క్ వైదొలుగుతు న్నట్లు ప్రకటించడం గమనార్హం.