Elon Musk : ట్విట్టర్ సీఈఓగా మస్క్ పెంపుడు కుక్క

Elon Musk : ట్విట్టర్ సీఈఓగా మస్క్ పెంపుడు కుక్క

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే. ట్విట్టర్ ను చేజిక్కించుకున్న నాటి నుంచి రోజుకో నిర్ణయంతో అందరికీ షాకిస్తున్న ఆయన.. తాజాగా అలాంటిదే మరో డెసిషన్ తీసుకున్నారు. ట్విట్టర్ సీఈఓగా తన పెంపుడు కుక్క ఫ్లోకీని అనౌన్స్ చేశాడు. ట్విట్టర్ ఆఫీసులో సీఈఓ టీ షర్ట్ వేసుకొని ఉన్న కుక్క ఫొటోని ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ‘ఫ్లోకీ ఇదివరకున్న ట్విట్టర్ సీఈఓ (పరాగ్ అగర్వాల్) కంటే మెరుగ్గా పనిచేస్తుంద’ని క్యాప్షన్ పెట్టాడు. దీనిపై స్పంధించిన నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

ఎలన్ మస్క్ ట్విట్టర్ ని హస్తగతం చేసుకున్న వెంటనే అప్పుడు సీఈఓగా ఉన్న పరాగ్ అగర్వాల్ ని పదవినుంచి తొలగించాడు. తర్వాత అందులో పనిచేస్తున్న కొంతమంది కీలక వ్యక్తుల్ని ఇంటికి పంపించాడు. ట్విట్టర్ విషయంలో మస్క్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీన్ని గమనించిన మస్క్ తాజాగా ‘నేను ట్విట్టర్ సీఈఓగా ఉండాలా? దిగిపోవాలా’ అని ట్విట్టర్ లో పోల్ పెట్టాడు. దీనికి ఓటింగ్ వేసిన 10 మిలియన్ నెటిజెన్స్ ట్విట్టర్ సీఈఓగా దిగిపోవాలనే జవాబిచ్చారు. దీంతో మస్క్ తన పెంపుడు కుక్కకు ట్విట్టర్ బాధ్యతలు అప్పజెపుతూ నిర్ణయం తీసుకున్నాడు.