Elon musk : ఆ టైంలో చనిపోతాననుకున్నా: ఎలన్ మస్క్

Elon musk : ఆ టైంలో చనిపోతాననుకున్నా: ఎలన్ మస్క్

ఎలన్ మస్క్ ట్వీట్లు, ప్రకటనలు తరచు వైరల్ అవుతుంటాయి. సమస్యలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, ట్విట్టర్‌లో తాజా పరిణామాల గురించి ప్రజలను అప్‌డేట్ ఇస్తుంటాడు. కొన్నిసార్లు తన జీవిత అనుభవాలను ట్వీట్లు పెడుతుంటాడు. తాజాగా ‘ఫెల్ట్ లైక్ డైయింగ్’ (చనిపోతా అనుకున్నా) అంటూ మస్క్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 

మస్క్ జర్మనీలోని టెస్లా గిగా ఫ్యాక్టరీకి వెళ్లేందుకు కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నాడు. డోస్ పూర్తయ్యాక తీవ్రమైన కండరాల నొప్పులు, ఒళ్ల మంటలు వచ్చాయట. ఆ టైంలో చనిపోతానేమో అన్నంత బాధ, భయం కలిగిందట. ఆ నొప్పుల నుంచి చాలా రోజుల తర్వాత కోలుకున్నానని మస్క్ చెప్పారు. తొలిసారి వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు చేయి కొంచెం నొప్పి అనిపించిందని అన్నారు. బూస్టర్ డోస్ వేసుకున్నప్పుడు మాత్రం అంతగా ఇబ్బంది పడలేదని చెప్పుకొచ్చాడు.