పంజాబ్-​హర్యానా హైకోర్టు కోర్టు సంచలన తీర్పు

పంజాబ్-​హర్యానా హైకోర్టు కోర్టు సంచలన తీర్పు

పఠాన్​కోట్: ముస్లిం అమ్మాయిల పెండ్లి ఏజ్​విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. అమ్మాయికి 16 ఏండ్లు, అబ్బాయికి 21 ఏండ్లు ఉంటే పెండ్లి చేసుకోవచ్చని తెలిపింది. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెండ్లి చేసుకు న్న జంటలలో ప్రాణహాని ఉన్నోళ్లకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. ఓ జంట జూన్​ 8న ముస్లిం సంప్రదాయం ప్రకారం పెండ్లి చేసుకుంది. రెండు కుటుంబాలు వ్యతిరేకించడంతో రక్షణ కల్పించాలంటూ కోర్టుకెక్కింది.

షరియా లా ప్రకారం.. అమ్మాయికి 16 ఏండ్లు వస్తే మేజర్ ​అని, పెండ్లి చేసుకోవచ్చని సింగిల్​ బెంచ్​ జడ్జి జస్టిస్​జస్జిత్​సింగ్​ బేడి తెలిపారు. షరియా చట్టం ప్రకారం.. పురుషులు, మహిళలు 15 ఏండ్ల వయస్సులో పెద్దలుగా పరిగణిస్తారని స్పష్టంచేశారు. వారిద్దరూ ఇష్టప్రకారమే పెండ్లి చేసుకున్న క్రమంలో వారి పెండ్లికి ఆమోదం తెలుపుతున్నట్టు ప్రకటించారు. ముస్లిం అబ్బాయి లేదా అమ్మాయి అయినా షరియా లా ప్రకారం స్వేచ్ఛగా పెండ్లి చేసుకోవచ్చని చెప్పారు.