ముస్లిం వా.. అయితే పాకిస్థాన్ కు పో

ముస్లిం వా.. అయితే  పాకిస్థాన్ కు పో

బీహార్ లో ముస్లిం వ్యాపారిపై కాల్పులు

బెగుసరాయ్ (బీహార్): మహ్మద్ ఖాసీమ్.. ఓచిన్న వ్యాపారి. డిటర్జంట్లు అమ్ముకుని బతుకుతున్నాడు. రోజు మాదిరి వాటిని అమ్ము కునేందుకు వెళ్లాడు. దారిలో రాజీవ్ యాదవ్ అనే వ్యక్తి అడ్డుపడ్డా డు. తాగి ఉన్నాడు. ‘నీ  పేరేంటి ’అని అడిగాడు. ఖాసీమ్ తన పేరు చెప్పాడు. ఉన్నట్టుం డి ఆగ్రహంతో ఊగిపోయాడు రాజీవ్. ‘నువ్వు ముస్లిం వా. మరి ఇక్కడేం చేస్తున్నావు. పాకిస్థాన్ కు వెళ్లిపో’ అంటూ తుపాకీతో కాల్పు లు జరిపాడు. బిహార్ లోని బెగుసరయ్ జిల్లా కుంభీలో  సోమవారం జరిగిందీ ఘటన. ముస్లిం అని తెలుసుకుని కాల్పు లు జరపడం చర్చనీయాంశమైంది.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాసీమ్ రిలీజ్ చేసిన వీడియో సోష ల్ మీడియాలో వైరల్అయింది. ‘‘పిస్తో ల్ తో కాల్పు లు జరిపాడు.ఒక బుల్లెట్ నా వీపులో దిగింది. అతడు బుల్లెట్లు నింపుకుంటుం డగా, నేను అక్కడి నుంచి తప్పిం చుకున్నాను” అని చెప్పుకొచ్చాడు.నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.