ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీంలో చాలెంజ్ చేయాలె

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీంలో చాలెంజ్ చేయాలె

ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ముస్లిం మహిళలపై అనవసరంగా రుద్దారని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ చట్టం అనవసరమన్న ఒవైసీ.. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలకు దిగారు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగానికి విరుద్ధమైందన్నారు. ఆగస్టు 1న ముస్లిం మహిళల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 

‘ట్రిపుల్ తలాక్ చట్టం ముస్లిం మహిళలకు కలిగిన ప్రయోజనమేం లేదు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టం. దీన్ని కచ్చితంగా సుప్రీం కోర్టులో చాలెంజ్ చేయాలె. ఈ చట్టం సమానత్వానికి వ్యతిరేకంగా ఉంది. మోడీ ప్రభుత్వం కేవలం ముస్లిం మహిళల హక్కుల దినోత్సవాన్నే జరుపుకుంటుందా? మరి, హిందువులు, దళితులు, ఓబీసీ మహిళల సాధికారత ఏమైనట్లు?’ అని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఈ చట్టం వల్ల ముస్లిం మహిళలు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ట్రిపుల్ తలాక్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయని, కానీ అవి పరిష్కారం కావట్లేదన్నారు. ఈ చట్టాన్ని గ్రౌండ్ లెవల్‌లో ముస్లింలు అంగీకరించట్లేదని స్పష్టం చేశారు.