ముస్తాఫిజుర్‌‌‌‌ ఔట్‌‌‌‌..ఐపీఎల్‌‌‌‌ నుంచి తొలగించిన నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌

ముస్తాఫిజుర్‌‌‌‌ ఔట్‌‌‌‌..ఐపీఎల్‌‌‌‌ నుంచి తొలగించిన నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌
  •  బంగ్లా–ఇండియా క్రికెట్‌‌‌‌ సంబంధాలపై ఎఫెక్ట్

గువాహటి: బంగ్లాదేశ్‌‌‌‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లా పేసర్‌‌‌‌ ముస్తాఫిజుర్‌‌‌‌ రెహమాన్‌‌‌‌ను ఐపీఎల్‌‌‌‌ జట్టు నుంచి తప్పించింది. వేలంలో ముస్తాఫిజుర్‌‌‌‌ను రూ. 9.20 కోట్లకు నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ దక్కించుకుంది. 

అయితే ప్రస్తుతం బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అతన్ని ఐపీఎల్‌‌‌‌ నుంచి తప్పించాలనే డిమాండ్లు పెరిగాయి. అవసరమైతే ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకునేందుకు అవకాశం ఇస్తామని నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌కు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ‘ముస్తాఫిజుర్‌‌‌‌ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ.. నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌ను కోరింది. 

దాని ప్రకారమే అతన్ని రిలీజ్‌‌‌‌ చేశారు. ఫ్రాంచైజీ ప్రత్యామ్నాయ ప్లేయర్‌‌‌‌ కావాలని  కోరుకుంటే ఇస్తాం’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌‌‌‌ సైకియా వెల్లడించారు. తాజా పరిణామాల నేపథ్యంలో పాక్ మాదిరిగా బంగ్లాతో ఇండియా క్రికెట్ సంబంధాలు దెబ్బతినే చాన్సుంది. 

సెప్టెంబర్​లో  టీమిండియా.. బంగ్లా టూర్‌‌‌‌ను బీసీసీఐ హోల్డ్‌‌లో పెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఫిబ్రవరిలో టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో బంగ్లా ఆడే మ్యాచ్‌‌‌‌లన్నీ ఇండియాలోనే జరగనున్నాయి. వాటిని శ్రీలంకకు మార్చాలని బంగ్లా బోర్డు డిమాండ్ చేసే చాన్స్ ఉంది.