జనం చూపిస్తున్న ఆదరణే శ్రీరామ రక్ష :  ముఠా గోపాల్

జనం చూపిస్తున్న ఆదరణే శ్రీరామ రక్ష :  ముఠా గోపాల్

ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పార్టీపై జనం చూపిస్తున్న ఆదరణే మాకు శ్రీరామ రక్ష అని ఆ పార్టీ ముషీరాబాద్ సెగ్మెంట్ అభ్యర్థి ముఠా గోపాల్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాంనగర్ చౌరస్తా నుంచి సాగర్ లాల్ హాస్పిటల్ వరకు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పాదయాత్ర చేశారు. కారు గుర్తుకు ఓటేసి ముషీరాబాద్​లో తనను గెలిపించాలని కోరారు.  అనంతరం ఆర్టీసీ రోడ్ లోని బీఆర్ఎస్ ఎన్నికల ఆఫీసులో జరిగిన బూత్ కమిటీ సమావేశానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఠా గోపాల్  మాట్లాడుతూ.. ఎన్నికలకు ఐదు రోజులే ఉన్నందున బీఆర్ఎస్ కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నారు. పదేళ్లుగా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ఎన్నో పథకాలను అమలు చేశామన్నారు.  కార్యక్రమంలో ముచ్చకుర్తి ప్రభాకర్, మోజెస్, శ్రీనివాస్ రెడ్డి,  చిట్టి శ్యాంసుందర్, నేత శ్రీనివాస్  పాల్గొన్నారు.