అక్టోబర్ 6న మురళీధరన్ వస్తున్నాడు

 అక్టోబర్ 6న  మురళీధరన్ వస్తున్నాడు

శ్రీలంక క్రికెటర్‌‌‌‌, స్పిన్‌‌‌‌ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్‌‌‌‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘800’. మురళీధరన్‌‌‌‌ పాత్రను మధుర్‌‌‌‌ మిట్టల్ పోషించగా, మహిమా నంబియార్‌‌‌‌ ఫీమేల్‌‌‌‌ లీడ్‌‌‌‌గా నటించింది. ఎం.ఎస్‌‌‌‌. శ్రీపతి దర్శకత్వంలో వివేక్ రంగాచారి నిర్మించారు.  ఈ సినిమా ఆలిండియా థియేట్రికల్ హక్కులను  నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.

 ఈ సందర్భంగా అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. రీసెంట్‌‌‌‌గా సచిన్ రిలీజ్ చేసిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.  క్రికెట్ లవర్స్‌‌‌‌తో పాటు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునే హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న చిత్రమిది అని దర్శక నిర్మాతలు చెప్పారు.  నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించాడు.