
TSRTC చైర్మన్ గా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇవాళ బస్భవన్ లో బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటివరకు టీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి కొనసాగారు. ఆయన స్థానంలో ఇప్పుడు ముత్తిరెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ముత్తిరెడ్డికి ఈ సారి బీఆర్ ఎస్ టికెట్ కేటాయించలేదు.