ఒడిశాలో మ్యూచువల్ ఫండ్స్ సర్టిఫికెట్ కోర్స్‌‌‌‌

ఒడిశాలో మ్యూచువల్ ఫండ్స్ సర్టిఫికెట్ కోర్స్‌‌‌‌

భువనేశ్వర్: విద్యార్థులలో ఆర్థిక అవగాహన  పెంపొందించడం,  ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో కామర్స్, మేనేజ్‌‌‌‌మెంట్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం 30 గంటల 'మ్యూచువల్ ఫండ్స్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్'ను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ బుధవారం ప్రకటించింది. బీకామ్‌‌‌‌, బీబీఏ, బీఎంఎస్‌‌‌‌, బీఏ (ఎకనామిక్స్ & కామర్స్), ఎంబీఏ, ఎంకామ్‌‌‌‌ విద్యార్థులకు ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. 

ఎన్ఎస్ఈ  భాగస్వామ్యంతో నిర్వహించే ఈ కోర్సు ద్వారా 'నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్' (ఎన్‌‌‌‌ఐఎస్‌‌‌‌ఎం) సిరీస్ వీఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేస్తారు.  భువనేశ్వర్, రూర్కేలా, సంబల్‌‌‌‌పూర్ తదితర ప్రాంతాలలోని ఎంపిక చేసిన 97 కళాశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌గా దీన్ని ఉచితంగా నిర్వహిస్తారు.

ప్రతి సంస్థ నుంచి 60 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు.  ఈ సర్టిఫికేషన్ ద్వారా విద్యార్థులు ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు, స్టాక్ బ్రోకర్లుగా కెరీర్ ప్రారంభించేందుకు అవకాశాలు మెరుగవుతాయి.