4 రెట్లు పెరిగిన ఎన్​ఎఫ్​ఓల వసూళ్లు

4 రెట్లు పెరిగిన ఎన్​ఎఫ్​ఓల వసూళ్లు

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు క్వార్టర్​లో మ్యూచువల్ ఫండ్స్ న్యూ ఫండ్స్​ ఆఫర్స్​(ఎన్‌‌ఎఫ్‌‌ఓ) వసూళ్లు నాలుగు రెట్లు పెరిగి రూ. 22,000 కోట్లకు చేరుకున్నాయి. మునుపటి క్వార్టర్​తో పోలిస్తే 48 కొత్త పథకాలు మ్యూచువల్ ఫండ్​ మార్కెట్‌‌లోకి వచ్చాయి. జూన్​ క్వార్టర్లలో 25 ఎన్​ఎఫ్​ఓల ద్వారా రూ.5,539 కోట్లు వసూలయ్యాయి. రాబోయే క్వార్టర్లల్లో మరిన్ని ఎన్‌‌ఎఫ్‌‌ఓలు రావొచ్చని రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి అన్నారు.

అనేక అసెట్​ మేనేజ్​మెంట్​ కంపెనీలు ( ఏఎంసీలు) ఈక్విటీ,  డెట్ ఇన్వెస్టర్‌‌లకు విభిన్నమైన ఉత్పత్తులను అందిస్తున్నాయని చెప్పారు.  లిస్టెడ్ వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, ఏఎంసీలు ఈక్విటీ  హైబ్రిడ్ కేటగిరీలలో మరిన్ని స్కీమ్‌‌లను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ప్రత్యేకించి మిడ్, స్మాల్,  మైక్రో క్యాప్  విభాగంలోకి మరిన్ని ఎన్​ఎఫ్​ఓలు  వస్తాయని వివరించారు.