న్యూఢిల్లీ: రైల్వేస్ కోసం ఎలక్ట్రికల్, పవర్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్‌మెంట్లను తయారు చేసే ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ ఐపీఓ ద్వారా రూ.290 కోట్లు సేకరించేందుకు సెబీ వద్ద ప్రిలిమినరి పేపర్లను సబ్మిట్ చేసింది.
ఇది పూర్తిగా ఫ్రెష్ షేర్ల ఇష్యూ. సేకరించిన ఫండ్స్‌లో రూ.180 కోట్లను లాంగ్ టెర్మ్ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, రూ.21 కోట్లను కొత్త ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్‌ను డెవలప్ చేయడానికి వాడతామని కంపెనీ పేర్కొంది. రైల్వే కోచ్‌ల కోసం స్విచ్‌గేర్ ప్యానెల్స్, కేబుల్ ప్రొటక్షన్ వంటివి ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ తయారు చేస్తోంది.
