
అన్నపురెడ్డిపల్లి, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా మూడేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణే లక్ష్యంగా పని చేస్తున్నట్లు హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ఎంవీ మధుసూధన్ తెలిపారు. గురువారం మండలంలోని బుచ్చన్నగూడెం గ్రామంలో కాళంగి గురవయ్యకు చెందిన ఆయిల్‌పామ్ తోటను పరిశీలించారు. ఈ ఏడాది భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అన్నపురెడ్డిపల్లి మండలంలోనే మెదట ప్లాంటేషన్ చేపట్టినట్లు చెప్పారు. అనంతరం అన్నపురెడ్డిపల్లి రైతు వేధిక భవనంలో రైతులకు అవగాహన, అధికారులతో సమీక్షకార్యక్రమాన్ని నిర్వహించారు.రైతులంతా ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుతో ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని అన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న తదితరులు ఉన్నారు.