మై ఆటో ఈజ్ సేఫ్ : సిటీ డ్రైవర్ల రిజిస్ట్రేషన్ మస్ట్

మై ఆటో ఈజ్ సేఫ్ : సిటీ డ్రైవర్ల రిజిస్ట్రేషన్ మస్ట్

 హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ‘మై ఆటో ఈజ్ సేఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీపీ అంజనీకుమార్. దీనికి ఆడిషనల్ ట్రాఫిక్ సీపీ అనిల్ కుమార్, అడిషనల్ సీపీ శిఖ గోయల్ అటెండయ్యారు. ఈ ప్రోగ్రామ్ లో సిటీలోని ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు.

హైదరాబాద్ కు ప్రపంచంలో సేఫ్ సిటీ అనే ముద్ర ఉందని సిటీ సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఒక నగరం అభివృధ్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పక ఉండాలని అన్నారు. మహిళలు ,పెద్దవారు, పిల్లలు సేఫ్ గా ఆటోలో వెళ్ళడానికి ‘మై ఆటో ఈజ సేఫ్’ ఉపయోగపడుతుందని చెప్పారు. ఆటో డ్రైవర్స్ అంతా.. మై ఆటో ఈజ్ సేఫ్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని… సేఫ్ జర్నీ… సేఫ్ సిటీ అనే పేరు నిలబెట్టాలని అన్నారు.

మై ఆటో ఈజ్ సేఫ్ ప్రోగ్రామ్ తో.. ప్యాసింజర్లు ముఖ్యంగా ఆడవాళ్లు బెరుకు లేకుండా ధైర్యంగా ఆటోలో ప్రయాణిచవచ్చని చెప్పారు ట్రాఫిక్ సీపీ అనిల్ కుమార్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లక్ష ఆటోలున్నాయని.. ఇంకా 70 వేల ఆటోల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందన్నారు.