
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej) కాంబోలో వస్తున్న మూవీ 'BRO'.. తాజాగా మరో బిగ్ అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. మై డియర్ మార్కండేయ అంటూ సాగే పాటకు 'సరస్వతి పుత్ర' రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ అందించగా రేవంత్, స్నిగ్ద శర్మ పాడారు.
'ఇంట్రో ఆపు .. దుమ్ము లేపు'.. 'డాన్స్ బ్రో.. లైక్ బ్రో..వంటి క్యాచీ లిరిక్స్ తో పాటు 'లైఫ్ అన్నాక ఉండాలిగా..రిలీఫ్ అన్నమాట' , 'మూడొచ్చాక ఆడాలిగా.. హుషారైనా ఆట' అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటుంది. పవన్ స్వాగ్, సాయి ధరమ్ ఎనర్జీ, ఊర్వశి రౌతుల డ్యాన్స్ కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. థమన్ ఇచ్చిన ట్యూన్ తో ఇక బాక్సులు మోగాల్సిందే.
ఈ చిత్రంలో కేతికా శర్మ, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ మూవీ వినోదయ సీతంకు రీమేక్‌గా సముద్రఖని(Samuthirakani) బ్రో మూవీని తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్(Trivikram) మాటలు అందిస్తుండగా..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) బ్యానర్ పై నిర్మిస్తున్నారు.