టీ20ల్లో నా వేగం తగ్గలేదు : విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ

టీ20ల్లో నా వేగం తగ్గలేదు : విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ

బెంగళూరు: టీ20ల్లో తన ఆటతీరుపై టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. అందరూ భావిస్తున్నట్లుగా షార్ట్‌‌‌‌‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో తన వేగం తగ్గలేదని, కెరీర్‌‌‌‌‌‌‌‌లోనే అత్యుత్తమ టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్నానని చెప్పాడు. ఇందులో ఎవరికీ ఎలాంటి డౌట్స్‌‌‌‌‌‌‌‌ అవసరం లేదన్నాడు.

‘టీ20ల్లో సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా. నా వేగం తగ్గిందని చాలా మంది భావిస్తున్నారు. కానీ అది కరెక్ట్‌‌‌‌‌‌‌‌ కాదు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో నేను చేసిన రన్సే ఇందుకు నిదర్శనం. ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో పరిస్థితులను బట్టి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ చేయాల్సి ఉంటుంది. ఖాళీల్లోకి బాల్స్‌‌‌‌‌‌‌‌ను పంపడంతో పాటు అవసరమైనప్పుడు భారీ షాట్లు కూడా కొట్టాలి. నేను అదే పని చేస్తున్నా. అందుకే భారీగా రన్స్‌‌‌‌‌‌‌‌ చేయగలుగుతున్నా’ అని విరాట్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. లాస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో సెంచరీ చేసినా ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ ఓడిపోవడం బాధించిందన్నాడు. అయితే శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ ఆట తమ నుంచి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను దూరం చేసిందని చెప్పుకొచ్చాడు.