నా పర్యటన వారి పెళ్లికి అడ్డుకారాదు: రామ్ నాథ్ కోవింద్

నా పర్యటన వారి పెళ్లికి అడ్డుకారాదు: రామ్ నాథ్ కోవింద్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. తన పర్యటన కారణంగా ఓ పెళ్లి నిలిచిపోతోందని తెలుసుకున్న రాష్ట్రపతి… మ్యారేజ్ ఆగిపోకుండా చర్యలు తీసుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.యూస్ కు చెందిన ఓ కుటుంబం తమ కుమార్తె ఆశ్లే హాల్ కు మ్యారేజ్ చేయాలని అనుకున్నారు. జనవరి 7న(ఇవాళ) వివాహాన్ని కొచ్చిలోని తాజ్‌ హోటల్‌ లో కల్యాణ వేదికగా నిర్ణయించారు. దీనికి సంబంధించి  8 నెలల క్రితమే అడ్వాన్స్ లు కూడా ఇచ్చారు.

అయితే.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కేరళ పర్యటనలో భాగంగా తాజ్ హోటల్ లో బస చేయాలని భావించారు. దీంతో 5వ తేదీన వివాహ ముహూర్తాన్ని మార్చుకోవాలని పెళ్లివారికి హోటల్ యాజమాన్యం సమాచారాన్ని ఇచ్చింది. దీంతో ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో పడిపోయారు. అయితే  పెళ్లి కూతురు ఆశ్లే హాల్… రాష్ట్రపతి భవన్‌ కు ట్వీట్ చేసింది. తన వివాహం సజావుగా సాగడానికి సహాయం కావాలని కోరింది. ఈ విషయం గురించి తెలుసుకున్న రాష్ట్రపతి రామ్ నాథ్ వెంటనే స్పందించారు. తన పర్యటన కారణంగా ఆ అమ్మాయి పెళ్లి ఆగిపోకూడదని… నిర్ణయించిన ముహూర్తానికే మ్యారేజ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో అధికారులు రాష్ట్రపతికి బసను, ఇటు పెళ్లికి ఏర్పాట్లనూ చేశారు. నిన్న(సోమవారం) మధ్యాహ్నం హోటల్ కు వచ్చిన రాష్ట్రపతి, ఇవాళ లక్షద్వీప్ కు వెళ్లనుండగా… ఆశ్లే హాల్ వివాహం కూడా అనుకున్న సమయానికే జరిగింది.