V6 News

కొత్త తరహా స్క్రీన్‌‌‌‌ప్లేతో తెరకెక్కిన సినిమా ‘మిస్టీరియస్‌‌‌’‌

కొత్త తరహా స్క్రీన్‌‌‌‌ప్లేతో తెరకెక్కిన సినిమా ‘మిస్టీరియస్‌‌‌’‌

రోహిత్, మేఘన రాజ్‌‌‌‌పుత్‌‌‌‌, అభిద్ భూషణ్, రియా కపూర్ లీడ్ రోల్స్‌‌‌‌లో మహి కోమటిరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టీరియస్‌‌‌‌’. జయ్ వల్లందాస్ నిర్మించారు.  ఈనెల 12న సినిమా విడుదల కానుంది.  మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ ‘ఈ చిత్ర దర్శకుడు మహి.. కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభంలో నా స్నేహితుడు. ‘శ్రీ తాతావతారం’ చిత్రంలో హీరో ఫ్రెండ్స్‌‌‌‌గా నటించాం. తనకోసమే ఇక్కడకు వచ్చా. 

ఓ సస్పెన్స్‌‌‌‌ పాయింట్‌‌‌‌తో చివరి ఇరవై నిమిషాల వరకు ఏం జరగబోతోంది అనే ఆసక్తి  కలిగించేలా ఈ సినిమా తీశారు.  గ్రాండ్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ కావాలని కోరుకుంటున్నా’ అని విష్ చేశారు.  ఒక కొత్త తరహా స్క్రీన్ ప్లేతో పూర్తిగా సస్పెన్స్‌‌‌‌తో తీసిన ఈ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని దర్శకుడు మహి తెలియజేశారు.  హీరోహీరోయిన్స్‌‌‌‌, నిర్మాత జయ్ వల్లందాస్‌‌‌‌ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.