లాస్యనందిత మృతిపై అనుమానాలు..ప్రమాద సమయంలో గన్ మెన్లు ఎక్కడ.?

లాస్యనందిత మృతిపై అనుమానాలు..ప్రమాద సమయంలో గన్ మెన్లు ఎక్కడ.?

బీఆర్ఎస్  ఎమ్మెల్యే  లాస్య నందిత మరణంపై  పీఏ ఆకాశ్ స్టేట్మెంట్ ను రికార్డు చేశారు పఠాన్ చెరు పోలీసులు. మేజిస్ట్రేట్ ముందు ఆయన వాగ్మూలం ఇచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదని చెప్పారు. లాస్య టిఫిన్ తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ  వెళ్ళామన్నారు. దర్గా నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత లాస్య కార్లో ఉన్న తన అక్క కూతుర్ని  ఇంకో కార్లో ఎక్కించి తాము  పటాన్ చెరు వైపు బయలుదేరామన్నారు. ఆక్సిడెంట్ టైంలో తన  మైండ్ బ్లాంక్ అయ్యిందని చెప్పారు.

 అయితే ప్రమాదం కంటే ముందే కారు మందుభాగంలోని పార్ట్స్ పగిలి కింద పడిపోయి ఉన్నాయన్నారు పటాన్ చెరు డీఎస్పీ. ముందు వెళ్తున్న వాహనం ఢీ కొట్టి కంట్రోల్ అవ్వక లెఫ్ట్ సైడ్ రేలింగ్ కి ఎమ్మెల్యే కారు ఢీకొట్టిందన్నారు. నిర్లక్ష్యంగా,  అతివేగంగా తో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద సమయంలో లాస్య  గన్ మెన్ లు ఎక్కడున్నారనేది తెలవాల్సి ఉంది..అలాగే ప్రమాదం కంటే ముందు ఉదయం నుంచి  ఏం జరిగిందనేది క్లారిటీ లేదు.   వాళ్లిద్దరే ఎందుకు వెళ్లారు లాస్య నందిత మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరో వైపు లాస్య నందిత పీఏ ఆకాశ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు కేసు పెట్టినట్లు చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడిపి తన సోదరి ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడని లాస్య సోదరి ఫిర్యాదులో తెలిపారు. డ్రైవర్ ఆకాశ్ పై సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.